ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ukraine Crisis: బంకర్లలో తెలుగు విద్యార్థులు... ఆందోళనలో తల్లిదండ్రులు - ఉక్రెయిన్‌లో అవస్థలు పడుతోన్న తెలుగు విద్యార్థులు

Telugu students in Ukraine: ఉక్రెయిన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా రాష్ట్రానికి చెందిన చాలామంది విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. బాంబుల దాడి వల్ల కొన్నిచోట్ల ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేకపోవటంతో... తాము ఉంటున్న పరిస్థితుల గురించి కుటుంబసభ్యులకు తెలిపే అవకాశం కూడా లేదని యానాంకు చెందిన విద్యార్థి వీడియో ద్వారా తెలిపారు. తనతో పాటు పుదుచ్చేరి, తమిళనాడుకు చెందిన విద్యార్థులు ఉన్నారని తెలిపారు.

Telugu students in Ukraine
Telugu students in Ukraine

By

Published : Feb 28, 2022, 12:14 PM IST

ఉక్రెయిన్‌లో అవస్థలు పడుతోన్న తెలుగు విద్యార్థులు

Telugu Students in Ukraine: ఉక్రెయిన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా మన దేశానికి చెందిన చాలామంది విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. ప్రకాశం జిల్లా అద్దంకి చెందిన బెల్లంకొండ చిరంజీవి, యానాంకు చెందిన ప్రభుదాస్ ఉక్రెయిన్‌లో ఉండటంతో వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. బాంబుల దాడి వల్ల కొన్ని చోట్ల ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేకపోవటంతో... తాము ఉంటున్న పరిస్థితుల గురించి కుటుంబసభ్యులకు తెలిపే అవకాశం కూడా లేదని ప్రభుదాస్ వీడియో ద్వారా తెలిపారు. తనతో పాటు పుదుచ్చేరి, తమిళనాడుకు చెందిన విద్యార్థులు ఉన్నారని.. ప్రస్తుతం బంకర్‌లో తలదాచుకున్నామని.. బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. అతికష్టం మీద కుటుంబసభ్యులను సంప్రదిస్తున్నామని వాపోతున్నారు.

బంకర్లలో ఉన్న విద్యార్థులు ఆహారం, నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం తమ పిల్లలను క్షేమంగా తీసుకురావాలని... విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details