ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమెరికాలోనూ అమ్మ భాష..

By

Published : Aug 29, 2021, 9:33 AM IST

రెక్కలు తొడిగి విదేశాలకు వెళ్లినప్పటికీ అమ్మ భాషను చాలామంది మరవడం లేదు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విదేశాల్లో మాతృ భాషను చిన్నారులకు నేర్పుతున్న 'పాఠశాల' గురించిన కథనం.

తెలుగు భాష శిక్షణ తరగతుల్లో చిన్నారులు
తెలుగు భాష శిక్షణ తరగతుల్లో చిన్నారులు

అమెరికాలో పుట్టి పెరుగుతున్న చిన్నారులు తెలుగుకు దూరం కాకూడదని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎనిమిది సంవత్సరాల క్రితం 'పాఠశాల' పేరుతో తెలుగు భాషాభివృద్ధికి పాటు పడే సంస్థను ప్రారంభించారు. అనంతరం తానా సహకారంతో ఇది విస్తృతమైంది. మాతృభాషపై ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు.. సాధారణ తరగతుల అనంతరం తమ బిడ్డలను ప్రత్యేక శిక్షణకు పంపుతుంటారు. తెలుగులో ప్రావీణ్యం ఉన్న వారితో పాటు.. భాషపై అభిరుచి ఉన్నవారు ఇక్కడ చిన్నారులకు బోధిస్తుంటారు. తెలుగు అక్షరాలు రాయడం.. సంప్రదాయాల గురించి తెలపడం.. నీతి కథలు, భారతదేశ చరిత్ర వంటివి ఇక్కడ నేర్పిస్తుంటారు. తెలుగు నేర్చుకోవాలనుకునే అభిలాష ఉన్నవారిని ఒక గూటికి కిందికి చేరుస్తోంది. ఉపాధ్యాయుల్ని వారి వద్దకే పంపి శిక్షణ ఇప్పిస్తోంది. అమెరికా దేశ వ్యాప్తంగా తెలుగు నేర్చుకునే వారు ఏ చిన్న గ్రామంలో ఉన్నా అక్కడ ఇప్పుడు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక తానా మహాసభల సమయంలో చిన్నారులతో అష్టావధానం, ఏకపాత్రాభినయం వంటి అంశాలను నేర్పి ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు.

మాతృభాషను విస్తృతం చేయాలనే..

"ఎనిమిది సంవత్సరాల క్రితం పాఠశాల అనే సంస్థను ప్రారంభించాం. ప్రస్తుతం ఛైర్మన్‌గా పని చేస్తున్నాను. రెండేళ్ల క్రితం తానా ఈ సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషిచేసింది. గతంలో కొద్దిమంది తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలను పంపేవారు. ఇప్పుడు వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సంస్థ నిర్వహణకు ప్రవాస భారతీయులు విరాళాలు కూడా అందిస్తున్నారు."-నాగరాజు, ఛైర్మన్‌, పాఠశాల గ్రూప్‌

ఇదీ చదవండి:ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదు: సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ABOUT THE AUTHOR

...view details