ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో తెలంగాణ మద్యం పట్టివేత - telangana wine seized in prakasam district

రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా పెరగటంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. నెల్లూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు తెలంగాణ నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి ప్రకాశం జిల్లాకు తరలిస్తుండగా ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 884 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

telangana liquor seized in ap
ప్రకాశం జిల్లాలో తెలంగాణ మద్యం పట్టివేత

By

Published : Aug 9, 2020, 9:45 PM IST

ప్రకాశం జిల్లాలో తెలంగాణ మద్యం పట్టివేత

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు. తెలంగాణ నుంచి వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు నెల్లూరు జిల్లా వన్నురుపాడు గ్రామానికి చెందిన బోగిరెడ్డి చంద్రారెడ్డి, నాగేశ్వరరావుగా గుర్తించారు. వీరు తెలంగాణ నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి ప్రకాశం జిల్లాలోని కట్టక్రిందపల్లి గ్రామంలో విక్రయిస్తుండగా దాడుల్లో పట్టుబడ్డారు. వీరి నుంచి 884 మద్యం బాటిళ్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో కనిగిరి ఎస్ఈబీ అధికారులు, మార్కాపురం సూపరింటెండెంట్​ ఎ.ఆవులయ్య పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details