ప్రవాసాంధ్రుల సహకారంతో ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో 800 మంది రైతులకు రాయితీ పవర్ స్ప్రేయర్లను.. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అందించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మార్టూరు మండలం ఇసుకదర్శిలో 'మన రైతన్న కోసం మన ఏలూరి' పేరుతో కార్యక్రమం నిర్వహించి.. స్ప్రేయర్లను అందజేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. రైతుల కోసం సాంబశివరావు చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అన్నదాతల కోసం శ్రమిస్తున్న ఏలూరిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అన్నదాతల సంక్షేమమే తన లక్ష్యమని.. ఏలూరి సాంబశివరావు చెప్పారు.
రైతులకు స్ప్రేయర్లు పంపిణీ చేసిన తెదేపా ఎమ్మెల్యే ఏలూరి - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
తెదేపా ఎమ్మెల్యే ఏలూరి.. రైతులకు స్ప్రేయర్లు పంపిణీ చేశారు. ప్రవాసాంధ్రుల సహకారంతో 800 మందికి రాయితీ పవర్ స్ప్రేయర్లను అందించారు. రైతుల సంక్షేమమే తన లక్ష్యమని సాంబశివరావు అన్నారు.

http://10.10.50.85//andhra-pradesh/18-January-2021/ap-ong-44-18-parchur-mla-free-power-sprayers-pampini-av-ap10068_18012021212510_1801f_1610985310_676.jpg