Teachers Counselling: ఉపాధ్యాయ బదిలీల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గందర గోళం చేస్తుందని.. ప్రస్తుతానికి బదిలీలు అంశం కోర్టు పరిధిలో ఉన్నందున సర్దుబాటు ప్రక్రియ నిలిపివేయాలని ఐక్య ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. కానీ ఇవేవీ పట్టించుకోని విద్యాశాఖ ఈరోజు టీచర్ల సర్దుబాటు బదిలీల ప్రక్రియ చేపట్టింది. ఒంగోలు డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో డీఈఓ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. కౌన్సిలింగ్ అర్హత ఉన్న ఉపాధ్యాయుల జాబితాలు రాత్రి విడుదల చేసి.. ఉదయాన్నే కౌన్సిలింగ్ హాజరుకావాలని సమాచారం ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్లో పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ సంక్రాంతి సెలవుల అనంతరం వారు కోరుకున్న స్థానాలకు బదిలీల ఉత్తర్వులు ఇస్తారని అధికారులు తెలిపారు. సెలవుల సమయంలో బదిలీలు నిర్వహించడంపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
బదిలీల ప్రక్రియ నిర్వహించడంపై.. ఉపాధ్యాయ సంఘాల అసంతృప్తి - prakasam district news
Teachers Counselling: ఉపాధ్యాయ బదిలీల అంశం కోర్టు పరిధిలో ఉన్నా కౌన్సిలింగ్ నిర్వహించడంపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. సర్దుబాటు ప్రక్రియ నిలిపివేయాలని ఉపాధ్యాయ సంఘ నేతలు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో విద్యాశాఖ కౌన్సిలింగ్ నిర్వహించింది. బదిలీల ప్రక్రియ నిర్వహించడంపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్