నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా బృందం పరిశీలన - నివర్ ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా బృందం పరిశీలన
త్రిపురాంతకం మండలంలోని దెబ్బతిన్న పంటలను తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, తెదేపా బృందంతో కలిసి ఆయన పరిశీలించారు.
నివర్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని మిరియంపల్లి, వెల్లంపల్లిలో దెబ్బతిన్న పంటలను తెదేపా బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రజాప్రతినిధులు సంపాదనలో నిమగ్నం కాగా...అధికారులు రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి పరిహారం కోసం పోరాటం చేస్తామన్నారు. ఎకరాకు రూ.30వేల నష్టపరిహారాన్ని అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఈ క్రమంలో తెదేపా రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.