కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా ఉఫాది కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ తెదేపా శ్రేణులు ప్రకాశం జిల్లా కనిగిరి తెదేపా కార్యాలయంలో నిరసనదీక్ష చేపట్టారు. భౌతిక దూరం పాటిస్తూ...ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా నిరాశ్రయులైన పేదలకు తక్షిణమే 5 వేల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు వేగవంతం చేయాలన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా మూసేసిన అన్నక్యాంటీన్లను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
పేద ప్రజలను ఆదుకోవాలని కోరుతూ తెదేపా నిరసన దీక్ష - ప్రకాశం జిల్లాలో లాక్డౌన్ కష్టాలు
కరోనా మహమ్మారి కారణంగా నిరాశ్రయులైన పేదలను ఆదుకోవాలని కోరుతూ..ప్రకాశం జిల్లా కనిగిరి తెదేపా కార్యాలయంలో ఆపార్టీ నేతలు నిరసనదీక్ష చేపట్టారు. మూసేసిన అన్నక్యాంటీన్లను వెంటనే పునరుద్ధరించటంతో పాటు పేదలకు 5 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
తెదేపా నిరసన దీక్ష