'రాజన్న రాజ్యమన్నారు.. రౌడీ రాజ్యం తెచ్చారు' - హోం మంత్రి
హోంమంత్రిగా ఉన్న మహిళ.. ఒంగోలులో సామూహిక అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించకపోవడం దారుణమని తెదేపా అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ విమర్శించారు.
అత్యాచారానికి గురై రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను తెదేపా అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ పరామర్శించారు. ఆమె వెంట శాసనమండలి సభ్యురాలు పోతుల సునీతతో పాటు తెదేపా మహిళా నేతలు ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని అనురాధ ఆవేదన చెందారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితులు ఆరుగురే అని పోలీసులు అంటున్నా... పది మందికి పైనే ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు. రాజన్న రాజ్యం తీసుకువస్తామని అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే... రౌడీ రాజ్యం తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు.