భాజపా, వైకాపా కలిసి రాష్టంలో దేవాలయాలపై దాడులు చేస్తున్నాయని రాష్ట్ర తెదేపా కార్యదర్శి సలగల రాజశేఖర్ దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లా చీరాలలో నియోజకవర్గ ఇన్ఛార్జి యడం బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెదేపా ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు.
తర్వలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా విజయకేతనం ఎగరవేసేలా కార్యకర్తలు కృషి చేయాలని రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలందరికీ అండగా ఉంటానని యడం బాలాజీ భరోసా ఇచ్చారు. ఈ సమావేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సహాన్ని నింపింది.