.
తెదేపా ఎమ్మెల్యేకు 'ఆదర్శ యువ అవార్డు'
జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డు ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు దక్కింది. దిల్లీలో ఎమ్మెల్యే ఈ అవార్డు అందుకున్నారు. మీట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ, భారత స్టూడెంట్ పార్లమెంట్ సంస్థలు ఈ అవార్డును సంయుక్తంగా ప్రదానం చేశాయి. రైతు కుటుంబంలో పుట్టిన తనకు పేదల కష్టాలు తెలుసని ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా పర్చూరులో తెదేపా శ్రేణులు మిఠాయిలు పంచిపెట్టి.. సంబరాలు చేసుకున్నారు.
పర్చూరు ఎమ్మెల్యేకు దక్కిన ఆదర్శయువ ఎమ్మెల్యే అవార్డు