ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Mahanadu: ఒంగోలులో వైభవంగా మహానాడు... మొత్తం 17 తీర్మానాలకు ఆమోదం

tdp mahanadu at ongole
ఒంగోలులో వైభవంగా మహానాడు

By

Published : May 27, 2022, 11:35 AM IST

Updated : May 27, 2022, 8:51 PM IST

20:50 May 27

తొలిరోజు ముగిసిన తెదేపా మహానాడు

  • ఒంగోలు: తొలిరోజు ముగిసిన తెదేపా మహానాడు
  • తెదేపా మహానాడులో మొత్తం 17 తీర్మానాలకు ఆమోదం

19:34 May 27

'క్విట్ జగన్-సేవ్ ఏపీ' పేరుతో రాజకీయ తీర్మానం

  • ఒంగోలు: తెదేపా మహానాడులో రాజకీయ తీర్మానం
  • 'క్విట్ జగన్-సేవ్ ఏపీ' పేరుతో మహానాడులో రాజకీయ తీర్మానం
  • తెదేపా మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన యనమల
  • పొత్తుల ప్రస్తావన లేకుండానే మహానాడులో రాజకీయ తీర్మానం
  • ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలంటూ తీర్మానంలో ప్రస్తావన
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యూహాలతో వెళ్లాలని తీర్మానంలో స్పష్టం
  • దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకోవాలని తీర్మానంలో స్పష్టీకరణ
  • 40 ఏళ్ల వేడుకతో మరోసారి పోరాటానికి కార్యోన్ముఖులం అవుదామని తీర్మానం
  • రాజకీయ శక్తుల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానం
  • రాష్ట్రాన్ని సంక్షోభంలోకి.. ప్రజల్ని బాధల్లోకి నెట్టిన విధానాన్ని వివరించాలని నిర్ణయం
  • ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలని నిర్ణయం
  • పార్టీకి దూరమైనవారిని చేరువచేసే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని నిర్ణయం
  • పార్టీ మరింత బలోపేతానికి బలమైన వ్యూహాల అమలుకు తీర్మానం
  • ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొని విజయం సాధించాలని తీర్మానం
  • వందేళ్లకు సరిపడా నాయకత్వాన్ని అందించేలా ప్రణాళికతో వెళ్లాలని నిర్ణయం

17:06 May 27

మహానాడు తర్వాత 2 పెద్ద కుంభకోణాలు బయటపెడతా: లోకేశ్‌

  • మీడియాతో నారా లోకేశ్‌ మాటామంతీ
  • పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానం రద్దు ప్రతిపాదన పెట్టా: లోకేశ్‌
  • ఈ విధానాన్ని నా నుంచే అమలు చేయాలని భావిస్తున్నా: లోకేశ్‌
  • జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు చేశా: లోకేశ్‌
  • ఈసారి తప్పుకుని వేరొకరికి అవకాశం కల్పిస్తా: లోకేశ్‌
  • ఈ తరహాలోనే పార్టీలో 2+1 విధానం రావాలి: లోకేశ్‌
  • రెండుసార్లు వరుసగా ఒకే పదవిలో ఉన్నవారికి బ్రేక్ ఇవ్వాలి: లోకేశ్‌
  • 30 స్థానాల్లో సరైన అభ్యర్థులను నియమించాల్సి ఉంది: లోకేశ్‌
  • వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడినవారికి టికెట్లపై చర్చ: లోకేశ్‌
  • మూడుసార్లు ఓడితే టికెట్లు ఇవ్వరాదనే చర్చ జరుగుతోంది: లోకేశ్‌
  • ఈ విషయమై చంద్రబాబు స్పష్టతతో ఉన్నారు: లోకేశ్‌
  • మహానాడు తర్వాత 2 పెద్ద కుంభకోణాలు బయటపెడతా: లోకేశ్‌
  • డబ్బుతోనే రాజకీయం చేయలేం.. డబ్బు లేకుండానూ చేయలేం: లోకేశ్‌
  • ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్థుల ప్రకటన: లోకేశ్‌
  • ఈలోగా కొంతమంది అభ్యర్థులకు స్పష్టత ఇచ్చేస్తాం: లోకేశ్‌
  • పనిచేయని నేతలకు, ఇన్‌ఛార్జ్‌లకు అవకాశాలుండవు: లోకేశ్‌
  • వచ్చే ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉండదని భావిస్తున్నా: లోకేశ్‌
  • కొన్ని స్థానాల్లో అభ్యర్థులు తిరిగి దండం పెడితే గెలిచే పరిస్థితి ఉంది: లోకేశ్‌
  • పార్టీ అధికారంలోకి రాగానే కీలక మార్పులు తెస్తాం: లోకేశ్‌
  • మంత్రులు పార్టీకి రిపోర్ట్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం: లోకేశ్‌
  • పార్టీ అనుబంధ విభాగాలతో చర్చించి నిర్ణయాలు: లోకేశ్‌
  • పార్టీకి.. ప్రభుత్వానికి గ్యాప్ తగ్గించేందుకే ఈ ప్రయత్నం: లోకేశ్‌

15:05 May 27

నక్కా ఆనందబాబు తీర్మానం

  • అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యంపై తీర్మానం
  • తీర్మానం ప్రవేశపెట్టిన తెదేపా నేత నక్కా ఆనందబాబు
  • అమరావతి నిర్మాణం ఆపేస్తే రాష్ట్రానికి, బడుగులకు నష్టం: ఆనందబాబు
  • పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు: నక్కా ఆనందబాబు
  • అమరావతి, పోలవరం పూర్తిచేస్తేనే రాష్ట్ర అభివృద్ధి: ఆనందబాబు
  • ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసంపై తీర్మానం ప్రవేశపెట్టిన సోమిరెడ్డి

14:46 May 27

ధూళిపాళ్ల తీర్మానం

  • కష్టాల కడలిలో సేద్యం-దగాపడుతున్న రైతన్న అంశంపై ధూళిపాళ్ల తీర్మానం
  • వైకాపా పాలనలో రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది: ధూళిపాళ్ల
  • 45 లక్షల ఎకరాల పంటల సాగుకు 15 లక్షల ఎకరాలకే బీమా ఇచ్చారు: ధూళిపాళ్ల
  • పెట్రో ధరల భారం కారణంగా రైతులపైనా తీవ్ర భారం పడుతోంది: ధూళిపాళ్ల
  • మోటార్లకు మీటర్లు పెడితే లాభమని మంత్రులు వింత వాదన చేస్తున్నారు: ధూళిపాళ్ల
  • మోటార్లకు మీటర్లు పెట్టబోమని తెలంగాణ స్పష్టంగా చెప్పింది: ధూళిపాళ్ల
  • తెదేపా హయాంలో రైతులకు ఉన్న పథకాలన్నీ ఆగిపోయాయి: ధూళిపాళ్ల
  • ప్రభుత్వం చెప్పిన రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ ఏమైంది?: ధూళిపాళ్ల

14:44 May 27

మహానాడులో తీర్మానాలను ప్రవేశపెడుతున్న నేతలు

  • మహానాడులో తీర్మానాలను ప్రవేశపెడుతున్న నేతలు
  • ఇప్పటివరకు నాలుగు తీర్మానాలను ప్రవేశపెట్టిన నేతలు
  • కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు, బాదుడే బాదుడుపై తీర్మానాలు
  • సంక్షేమ పథకాల్లో మోసం, కష్టాల కడలిలో సేద్యం అంశాలపై తీర్మానాలు

11:39 May 27

రాష్ట్రాన్ని పాలించే అర్హత వైకాపా ప్రభుత్వానికి లేదు: చంద్రబాబు

  • మహానాడు పేరంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్‌: చంద్రబాబు
  • మహానాడు అనేది తెలుగుజాతికి ఒక పండగ: చంద్రబాబు
  • ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు: చంద్రబాబు
  • మనందరం కృషిచేస్తే భగవంతుడి ఆశీర్వదిస్తారు: చంద్రబాబు
  • ఈ మహానాడుకు ప్రత్యేకత ఉంది... తెదేపా 40 ఏళ్లు పూర్తిచేసుకుంది: చంద్రబాబు
  • గడిచిన మూడేళ్లుగా చాలా ఇబ్బందులు పడ్డాం: చంద్రబాబు
  • రాష్ట్రం పరువుపోయే స్థితికి తీసుకొచ్చారు: చంద్రబాబు
  • రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే పార్టీ తెదేపా: చంద్రబాబు
  • తప్పును ప్రశ్నిస్తే విరోధులుగా చూస్తున్నారు: చంద్రబాబు
  • అక్రమ కేసులు బనాయించి దాడి చేస్తున్నారు: చంద్రబాబు
  • వైకాపాకు అభివృద్ధి చేయడం చేతకాదు: చంద్రబాబు
  • పోలీసులను అడ్డంపెట్టుకుని పాలన చేస్తున్నారు: చంద్రబాబు
  • ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు: చంద్రబాబు
  • కేసులు, లాఠీలతో భయపడే ప్రశ్నే లేదు: చంద్రబాబు
  • డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు అందరూ ఆలోచించాలి: చంద్రబాబు
  • ఉన్మాది చేతిలో పోలీసులు బలికావద్దని సూచిస్తున్నా: చంద్రబాబు
  • తప్పుడు పనులు చేస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదు: చంద్రబాబు
  • దేశంలో ఎక్కడాలేని విధంగా పన్నులు పెంచారు: చంద్రబాబు
  • ప్రజలపై పన్నుల భారం వేసి ఇబ్బందిపెట్టారు: చంద్రబాబు
  • ఎవరైనా తప్పు తెలుసుకుంటే బాగుపడతారు: చంద్రబాబు
  • చెప్పింది వినకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు: చంద్రబాబు
  • ఆర్టీసీ, విద్యుత్‌.. ఒకటేమిటి అన్ని ఛార్జీలు పెంచేశారు: చంద్రబాబు
  • నిత్యావసరాలు కొనే పరిస్థితి లేక ఇబ్బందిపడుతున్నారు: చంద్రబాబు
  • వైకాపా పాలనలో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేరు: చంద్రబాబు
  • రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు... మేము అండగా ఉంటాం: చంద్రబాబు
  • రైతులకు మళ్లీ మంచి రోజులు వచ్చే పరిస్థితి రాబోతోంది: చంద్రబాబు
  • మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరిస్థితి తీసుకొస్తారా?: చంద్రబాబు
  • మోటార్లకు మీటర్లు పెడితే భవిష్యత్తులో చాలా నష్టం వస్తుంది: చంద్రబాబు
  • అమ్మఒడి అన్నారు... నాన్న బుడ్డి పెట్టారు: చంద్రబాబు
  • అమ్మఒడి కంటే నాన్న బుడ్డి ద్వారా వసూలు మొదలుపెట్టారు: చంద్రబాబు
  • తెదేపా హయాంలో పెట్టిన అన్న క్యాంటీన్‌ తీసేశారు: చంద్రబాబు
  • విదేశీ విద్య, పెళ్లి కానుక వంటి పథకాలన్నీ ఏం చేశారు: చంద్రబాబు
  • ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళిక తెచ్చాం: చంద్రబాబు
  • అంబేడ్కర్‌ స్ఫూర్తితో మనం ముందుకెళ్లాం: చంద్రబాబు
  • తెలుగుదేశం పార్టీ... వెనుకబడిన వర్గాల పార్టీ: చంద్రబాబు
  • ఎన్నికల ముందు మద్యపాన నిషేధమన్నారు: చంద్రబాబు
  • మద్యపాన నిషేధ హామీ తుంగలో తొక్కారు: చంద్రబాబు
  • నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చి దండుకుంటున్నారు: చంద్రబాబు
  • ఇళ్లు కట్టిస్తామంటున్నారు... కనీసం ఇసుక దొరుకుతుందా?: చంద్రబాబు
  • వైకాపా దోపిడీ వల్ల ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది: చంద్రబాబు
  • భూములు దర్జాగా కబ్జా చేస్తున్నారు: చంద్రబాబు
  • రాష్ట్రాన్ని పాలించే అర్హత వైకాపాకు లేదు: చంద్రబాబు
  • వైకాపా ప్రభుత్వం అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసింది: చంద్రబాబు
  • మోసకారి సంక్షేమం అమలు చేస్తున్నారు: చంద్రబాబు
  • రాష్ట్రాన్ని పాలించే అర్హత వైకాపా ప్రభుత్వానికి లేదు: చంద్రబాబు
  • 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు: చంద్రబాబు
  • పోలవరం ఏమైంది.. విభజన హామీలు ఏమయ్యాయి?: చంద్రబాబు
  • గెలిచిన తర్వాత కేంద్రం వద్ద మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు: చంద్రబాబు
  • మద్యం, గంజాయి, డ్రగ్స్‌తో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా చేస్తున్నారు: చంద్రబాబు
  • ఐఎస్‌బీ 20 ఏళ్ల వార్షికోత్సవానికి నిన్న ప్రధాని వచ్చారు: చంద్రబాబు
  • ఐఎస్‌బీని తెదేపా హయాంలో ప్రారంభించాం: చంద్రబాబు
  • తెదేపా ఇలాంటి అభివృద్ధి పనులు కొన్ని వందలు చేసింది: చంద్రబాబు
  • ఐఎస్‌బీ హైదరాబాద్‌లో ఏర్పాటు కోసం తీవ్రంగా శ్రమించా: చంద్రబాబు
  • ఐఎస్‌బీ తీసుకురావడం జీవితంలో ఎంతో సంతృప్తినిచ్చింది: చంద్రబాబు
  • ఐఎస్‌బీ ఏర్పాటు ప్రతిపాదనల్లో ఆంధ్రప్రదేశ్‌ లేదు: చంద్రబాబు
  • ప్రతిపాదనల్లో బెంగళూరు, చెన్నై మాత్రమే ఉన్నాయి: చంద్రబాబు
  • ఐఎస్‌బీ ఏర్పాటు పరిశీలన బృందాన్ని భోజనం కోసం పిలిచా: చంద్రబాబు
  • హైదరాబాదే ఐఎస్‌బీ ఏర్పాటుకు అనుకూలమైందనే విషయం చెప్పా: చంద్రబాబు
  • నా ప్రతిపాదన నచ్చి హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటుకు అంగీకరించారు: చంద్రబాబు
  • సీఎం పదవి నాకు కొత్త కాదు: చంద్రబాబు
  • ఎక్కువ సమయం సీఎంగా ఉండే అవకాశమిచ్చారు: చంద్రబాబు
  • నా ఆవేదన, బాధ అంతా రాష్ట్రం నాశనమైంది: చంద్రబాబు
  • రాష్ట్ర ప్రజలంతా బాధల్లో ఉన్నారు: చంద్రబాబు
  • రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది: చంద్రబాబు
  • ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చారు: చంద్రబాబు
  • ఒక్క ఛాన్స్‌ అని కరెంటు తీగ పట్టుకుంటే ఏమవుతుంది: చంద్రబాబు
  • ఒక్క ఛాన్స్‌ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారు: చంద్రబాబు
  • ఎస్సీ వ్యక్తిని ఇంటినుంచి తీసుకెళ్లి ఎమ్మెల్సీ చంపేశారు: చంద్రబాబు
  • హత్య చేశాక మృతదేహాన్ని నేరుగా ఇంటికి తీసుకొచ్చారు: చంద్రబాబు
  • కప్పిపుచ్చుకోవడానికి ప్రమాదమని చిత్రీకరించారు: చంద్రబాబు
  • సుబ్రహ్మణ్యం హత్యతో ఎస్సీల్లో వ్యతిరేకత వచ్చింది: చంద్రబాబు
  • దృష్టి మరల్చేందుకు కోనసీమ అల్లర్లు సృష్టించారు: చంద్రబాబు
  • మంత్రి ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు: చంద్రబాబు
  • మనం బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టాం: చంద్రబాబు
  • గడప గపడకు ప్రభుత్వం అని కార్యక్రమం పెట్టారు: చంద్రబాబు
  • ప్రజల నుంచి స్పందన లేకపోయేసరికి యాత్ర మొదలుపెట్టారు: చంద్రబాబు
  • సామాజిక న్యాయమని గొప్పలు చెప్పుకొని రాజ్యసభ సీట్లు ఎవరికిచ్చారు: చంద్రబాబు
  • క్విట్‌ జగన్‌... సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదం తీసుకొస్తున్నా: చంద్రబాబు
  • జగన్‌ దిగిపోతే తప్ప రాష్ట్రానికి మంచి రోజులు రావు: చంద్రబాబు
  • జగన్‌ అండ్‌ కంపెనీ ఆదాయం పెరిగింది: చంద్రబాబు
  • జగన్‌ అనుయాయుల ఆదాయం పెరిగింది: చంద్రబాబు
  • ప్రజల ఆదాయం మాత్రం తగ్గింది: చంద్రబాబు
  • క్విట్‌ జగన్‌...సేవ్‌ ఏపీ నినాదం ప్రతి ఇంట్లో వినిపించాలి: చంద్రబాబు
  • వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తున్నాం: చంద్రబాబు
  • పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉంది: చంద్రబాబు
  • నూతన ఉత్సాహంతో ఉండేవాళ్లను ఎంపికచేద్దాం: చంద్రబాబు
  • తెదేపా కార్యకర్తలంతా నా కుటుంబం: చంద్రబాబు
  • కుటుంబ పెద్దగా కార్యకర్తలకు అండగా ఉంటున్నా: చంద్రబాబు

11:17 May 27

ప్రజల హృదయాల్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం: అచ్చెన్నాయుడు

  • ఒంగోలులో మహానాడు వైభవంగా జరుపుకుంటున్నాం: అచ్చెన్న
  • 40 ఏళ్లలో అనేక సందర్భాల్లో మహానాడు జరుపుకున్నాం: అచ్చెన్న
  • ఈసారి మహానాడుకు ప్రత్యేకత ఉంది.. పార్టీ పుట్టి 40 ఏళ్లయింది: అచ్చెన్న
  • అధికారం ఉన్నా... లేకున్నా నిరంతరం ప్రజల మధ్య ఉండే పార్టీ తెదేపా: అచ్చెన్న
  • ప్రజల హృదయాల్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం: అచ్చెన్నాయుడు
  • తెలుగుదేశం పార్టీని జగన్‌ ఏమీ చేయలేరు: అచ్చెన్నాయుడు
  • బాదుడే బాదుడు కార్యక్రమానికి విపరీతమైన స్పందన వచ్చింది: అచ్చెన్న
  • తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: అచ్చెన్నాయుడు
  • చంద్రబాబు సీఎం అయ్యాక ఒకే సంతకంతో కేసులన్నీ తీసేస్తాం: అచ్చెన్న
  • మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని జగన్‌ నాశనం చేశారు: అచ్చెన్నాయుడు
  • వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయం: అచ్చెన్న
Last Updated : May 27, 2022, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details