ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో తెదేపా కార్యకర్తలపై వైకాపా వర్గీయులు బుధవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తెదేపా వర్గీయుడు లక్కీ పోగు సుబ్బారావు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బుధవారం రాత్రి నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతున్న వారిని తెదేపా నేతలు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద బాబు గురువారం పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో శాంతియుత వాతవరణం ఉండే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వైకాపా నాయకుల దాడిలో గాయపడ్డ తెదేపా కార్యకర్తలకు పరామర్శ - narasarao peta news
ప్రకాశం జిల్లా కామేపల్లిలో వైకాపా నేతల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్తలను.. పార్టీ నేతలు పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
![వైకాపా నాయకుల దాడిలో గాయపడ్డ తెదేపా కార్యకర్తలకు పరామర్శ tdp leader](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12244312-208-12244312-1624519644964.jpg)
తెదేపా కార్యకర్తలకు పరామర్శ