ప్రాణం ఎవరిదైనా ఒక్కటేనని, దాని విలువ ప్రాంతాలు బట్టి, కులాలు బట్టి మారదని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారు. విశాఖ పాలిమర్ దుర్ఘటనలో మరణించిన కుటుంబాలకు కోటి పరిహారం ఇచ్చిన ప్రభుత్వం... ప్రకాశం జిల్లా మాచవరంలో మరణించిన రైతు కూలీలకు మాత్రం 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవటం ఏమిటని ప్రశ్నించారు. తెదేపా తరపున త్రిసభ్య కమిటి సభ్యులు మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర, నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బి.ఎన్ విజయకుమార్ మాచవరంలో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు.
'ప్రాణం ఎవరిదైనా ఒక్కటే... ప్రాంతం, కులాన్ని బట్టి మారదు' - మాచవరంలోతెదేపా నేతలు పరామర్శ
ప్రకాశం జిల్లా మాచవరంలో మరణించిన రైతు కూలీల కుటుంబాలను తెదేపా నేతలు పరామర్శించారు. విశాఖ పాలిమర్ దుర్ఘటనలో మరణించిన కుటుంబాలకు కోటి పరిహారం ఇచ్చిన ప్రభుత్వం... రైతు కూలీలకు మాత్రం 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవటం ఏమిటని వారు ప్రశ్నించారు.

'ప్రాణం ఎవరిదైనా ఒక్కటే...ప్రాంతం, కులాన్ని బట్టి మారదు'
బి.ఎన్ విజయకుమార్ తన సొంతంగా ఒక్కో కుటుంబానికి పాతిక వేలు, పార్టీ తరపున మరో పాతికవేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇంటింటికి వెళ్ళి మృతుల కుటుబంసభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఆసరాగా ఉన్న కుటుంబ పెద్ద మృత్యవాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుంటుబాలకు ఉద్యోగాలు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.