వర్షాకాలంలోనూ... ప్రకాశం జిల్లా ఒంగోలు నగర వాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెదేపా శ్రేణులు, మాజీ కౌన్సిలర్లు సమ్మర్ స్టోరేజి చెరువు వద్ద ఆందోళనకు దిగారు. ఒంగోలులోని చెరువులు పరిశీలించారు. అవి అడుగంటి ఉండటంపై నిరసన తెలిపారు. ఖాళీ అయిన చెరువులను వెంటనే సాగర్ నీటితో నింపాలని డిమాండ్ చేశారు.
'చెరువులు నింపి.. తాగునీటి ఇబ్బందులు తీర్చండి' - ఒంగోలులో తెదేపా నేతల ఆందోళన
ప్రకాశం జిల్లా ఒంగోలులో తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలో చెరువులో ఎండిపోయిన కారణంగా.. వర్షాకాలంలోనూ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే వాటిని నీటితో నింపి తాగునీటి ఇబ్బందులు తీర్చాలని కోరారు.
తెదేపా నేతల ధర్నా