ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఆందోళన - parishath elections in antipeta

విజయనగరం జిల్లా ఆంటిపేట ఎంపీటీసీ స్థానానికి రీ పోలింగ్ సందర్భంగా తెదేపా నేతలు ఆందోళన చేశారు. వైకాపా నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ గ్రామంలోని రహదారిపై బైఠాయించారు.

tdp leaders protest in antipeta
వైకాపా నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఆందోళన

By

Published : Apr 9, 2021, 8:32 PM IST

విజయనగరం జిల్లా సీతానగరం మండలంలోని ఆంటిపేట ఎంపీటీసీ స్థానానికి అధికారులు రీపోలింగ్ నిర్వహించారు. బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల పేర్లు తప్పుగా నమోదు కావడంతో రీ పోలింగ్​కు కలెక్టర్ జవహర్​లాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రీ పోలింగ్​లో వైకాపా వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ.. తెదేపా శ్రేణులు గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల తరఫున వేరే వారు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details