ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ ఇంచార్జి లావణ్యకు.. తెదేపా నాయకులు, పోటీలో ఉన్న వార్డు సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు నామపత్రాలు సమర్పించేందుకు కార్యాలయానికి వెళ్తే గేట్లు వేసి.. వైకాపా నాయకులు బెదిరించారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు నామపత్రాలు స్వీకరించి.. తమకు పోటీలో నిలిచే అవకాశం కల్పించాలని తెదేపా నేతలు కోరారు.
'నామపత్రాల స్వీకరణకు అనుమతించండి' - kanigiri latest news
నామపత్రాల దాఖలుకు ప్రభుత్వం అడ్డుకుంటోందని.. అధికార పార్టీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రకాశం జిల్లా తెదేపా నాయకులు, పోటీలో ఉన్న అభ్యర్థులు.. అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు.
వినతిపత్రం