కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమని తెదేపా సీనియర్ నాయకులు, ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిశీలకులు సలగల రాజశేఖర్ బాబు, కరీముల్లా, సదాశివరావు అన్నారు. మార్టూరు మండలం ఇసుక దర్శిలోని క్యాంపు కార్యాలయంలో సంస్థాగత సదస్సు నిర్వహించారు.
మండల అధ్యక్షులు ఆదినారాయణ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో యువతకు పెద్దపీట వేసేలా గ్రామంలో సంస్థాగత నిర్మాణం బలోపేతం కావాలన్నారు. తెదేపా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.