జగన్ అవినీతి సొమ్ముకు కరణం అమ్ముడుపోయారని ప్రకాశం జిల్లా తెలుగుదేశం నేతలు ఎరిక్సన్ బాబు, నూకసాని బాలాజీ ఆరోపించారు. చంద్రబాబును విమర్శించే అర్హత వైకాపా నేతలకు లేదన్నారు.
'చీరాల ఎమ్మెల్యేగా ఎలా గెలిచారు?' - కరణం బలరాంపై తెదేపా నేతల ఆగ్రహం
వైకాపా తీర్థం పుచ్చుకున్న కరణం బలరాంపై తెదేపా నేతలు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇబ్బంది పెట్టి ఉంటే చీరాల శాసనసభ్యుడిగా గెలుపొందేవారా? అని నిలదీశారు.
కరణం బలరాంపై తెదేపా నేతల ఆగ్రహం
తెదేపా నేతలే కరణం బలరాంని గెలిపించారన్నారు. ప్రలోభ పెట్టి పార్టీలోకి వైకాపాలోకి లాక్కొన్న తెదేపా నేతల చేతనే... తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేయిస్తున్నారని నూకసాని బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కరణం బలరాం ఆ కోవకు చెందిన వారే అన్నారు. చంద్రబాబు ఇబ్బంది పెడితే... చీరాల ఎమ్మెల్యేగా కరణం బలరాం గెలిచేవారా? అని ప్రశ్నించారు. పార్టీలో ఇబ్బంది ఉంటే 2019లోనే వెళ్లిపోవాలి కదా అని నిలదీశారు.
ఇదీ చదవండి:కానిస్టేబుల్‌కు కరోనా...కంటైన్మెంట్ జోన్‌గా పర్చూరు