తెదేపా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ - ongole tdp leaders vegetables distribution news in telugu
ఒంగోలు పేర్నమెట్ట పరిధిలోని అరుణోదయ కాలనీ వాసులకు తెదేపా ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 400 కుటుంబాలకు ఇంటింటికి తిరిగి కూరగాయలు అందజేశారు.
తెదేపా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ
లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలకు దాతలు నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమం సాగుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు పేర్నమెట్ట పరిధిలో అరుణోదయ కాలనీ వాసులకు తెదేపా ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లీ సుమారు 400 కుటుంబాలకు సరకులు అందజేశారు. స్థానిక తెదేపా నాయకులు మహేష్, గోవింద్, మురళి తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు.