సీనియర్ వైద్యుడు సుధాకర్ పట్ల పోలీసుల ప్రవర్తించిన తీరును నిరసిస్తూ ప్రకాశం జిల్లా కనిగిరిలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన తెలియజేశారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు కనిగిరి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ ఉగ్రనరసింహరెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు బస్టాండ్ కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సీనియర్ దళిత డాక్టర్ని పోలీసులు అర్ధనగ్నంగా ప్రదర్శించి, తాళ్లతో కట్టి దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీలకు, బీసీలకు తెదేపా అండగా ఉంటుందని కనిగిరి తెదేపా నేతలు తెలిపారు.
నల్లబ్యాడ్జీలు, జెండాలతో తెదేపా నిరసన - agitation in kanigiri on dr sudhakar arrest
డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసుల తీరును ఖండిస్తూ, ప్రకాశం జిల్లా కనిగిరిలో తెదేపా నేతలు నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన తెలిపారు. ఎస్సీలకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
![నల్లబ్యాడ్జీలు, జెండాలతో తెదేపా నిరసన tdp leaders agitation in kanigiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7246007-788-7246007-1589797104624.jpg)
కనిగిరిలో తెదేపా నిరసన