ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lokesh: 'ప్రశాంతంగా ఉన్న పల్లెలను.. ఫ్యాక్షన్ కేంద్రాలుగా మార్చారు' - prakasam district crime

ప్రకాశం జిల్లా కామేపల్లిలో తెదేపా కార్యకర్త సుబ్బారావు హత్యపై లోకేశ్ స్పందించారు. జగన్ సర్కార్ పాలనలో ఇంకెంతమంది కార్యకర్తలను బలి తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp-leader-nara-lokesh-fire
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

By

Published : Jun 24, 2021, 6:18 PM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం కామేపల్లిలో... తెదేపా కార్యక‌ర్త లక్కెపోగు సుబ్బారావు హత్య అత్యంత దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత‌ ప‌ల్లెలను ముఖ్యమంత్రి జగన్ ఫ్యాక్షన్ కేంద్రాలుగా మార్చారని ధ్వజమెత్తారు.

ప్రస్తుత ప్రభుత్వ క‌క్షపూరిత పాల‌న‌లో ఇంకెంత‌మంది కార్యక‌ర్తలను బ‌లి తీసుకుంటారని లోకేశ్ వైకాపా నేతలను నీలదీశారు. సుబ్బారావు కుటుంబానికి, గాయ‌ప‌డిన కార్యకర్తలకు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details