ఒంగోలులో వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న దివ్యాంగురాలు భువనేశ్వరి అనుమానాస్పద మృతిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల మానప్రాణాలకు భద్రత లేకపోగా, తాజాగా దివ్యాంగులకూ రక్షణ లేదన్నది భువనేశ్వరి దుర్ఘటన చాటుతోందన్నారు. రాష్ట్రంలో అనుమానాస్పద మరణాలు, హత్యలు, హత్యాచారాలు, అమానుష చర్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. భువనేశ్వరి సజీవ దహనం వెనుక ఉన్న అన్ని అనుమానాలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది: చంద్రబాబు - ongole crime news
ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరి అనుమానాస్పద మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. భువనేశ్వరి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన జరిగితే మరుసటి రోజు సాయంత్రం వరకు శవపరీక్ష నిర్వహించకుండా జాప్యం ఎందుకు చేశారని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓం ప్రతాప్, గుంటూరు జిల్లా గురజాలలో దళిత యువకుడు దోమతోటి విక్రమ్, ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలులో భువనేశ్వరి ఇలా వరుస దుర్ఘటనలు క్షీణిస్తున్న శాంతి భద్రతలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయని, బయటకెళ్లిన మహిళలు క్షేమంగా తిరిగివచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. భువనేశ్వరి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.