ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామంలో.. తెదేపా దర్శి నియోజకవర్గ ఇంఛార్జ్ పమిడి రమేశ్ సొంత నిధులతో మంచినీటి సౌకర్యం కల్పించారు. తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వడియరాజుల కాలనీవాసుల కోసం బోర్ వేయించి.. వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం నరసరావుపేటలో పర్యటిస్తున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ఉన్మాది చేతిలో మరణించిన అనూష కుటుంబాన్ని పరామర్శించి, తన సానుభూతిని తెలియజేసేందుకు వెళ్తున్న నారా లోకేశ్, ఇతర పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు. దిశ చట్టం కింద వారం రోజుల్లో విచారణ, 21 రోజుల్లో శిక్ష అంటూ.. మహిళల భద్రత మాటలకే పరిమితం చేశారని దుయ్యబట్టారు. దిశ లేని దిశా చట్టం పేరుతో రాష్ట్ర మహిళాలోకాన్ని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. బాధితుల పట్ల చిత్తశుద్ది ఉంటే న్యాయం చేయాలి కానీ.. పరామర్శకు వెళ్తున్న వారిని అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైకాపా నేతలకు మాత్రం పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత నిధులతో తెదేపా నేత మంచినీటి సదుపాయం - nara lokesh
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో తెదేపా ఇంఛార్జ్ పమిడి రమేశ్ సొంత నిధులతో ప్రజలకు మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. గుంటూరు జిల్లాలో నారా లోకేశ్ పర్యటనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.
tdp leader arranged water facility
ఇదీ చదవండి: