వికేంద్రీకరణ పేరుతో అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తానన్న ముఖ్యమంత్రి నాలుగు గోడల మధ్యనుంచి బయటకు రాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం ఆమరణ నిరాహారదీక్షకు దిగిన తెదేపా నేత కందుల నారాయణరెడ్డికి ఆయన సంఘీభావం తెలిపారు. ఆలపాటితో పాటు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా తన సంఘీభావం ప్రకటించారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతంలో ప్రత్యేక జిల్లాకోసం ఆందోళనలు జరుగుతుంటే సీఎంతో పాటు ప్రజాప్రతినిధులకు చీమ కొట్టినట్లు కూడా లేకపోవడం దారుణమన్నారు.
'అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తానని..నాలుగు గోడల మధ్య నుంచి సీఎం బయటకు రావటం లేదు' - tdp news
సీఎం జగన్పై తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శలు చేశారు. వికేంద్రీకరణ పేరుతో అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తానన్న ముఖ్యమంత్రి నాలుగు గోడల మధ్యనుంచి బయటకు రాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు.

తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్
'అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తానని..నాలుగు గోడల మధ్య నుంచి సీఎం బయటకు రావటం లేదు'
ఇదీ చదవండి :మార్కాపురం జిల్లాకోసం రెండవ రోజు ఆమరణ దీక్ష..