Acchennaidu Fired on YCP: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ 160 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి వర్గం జగన్ బాధితులేనన్న ఆయన, ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఇటీవల జరిపిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 30కి మించి స్థానాలు రావని తేలిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అప్పటినుంచే జగన్‌లో అసహనం పెరిగిపోయిందన్నారు. అందుకే ప్రతిపక్షాలపై నోరుపారేసుకుంటున్నారని వివరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరగబోయే మహానాడు ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన అచ్చెన్న మీడియా సమావేశంలో మాట్లాడారు.
రానున్న ఎన్నికల్లో గెలిచేది తెదేపానే: అచ్చెన్నాయుడు - Acchennaidu Fired on YCP
Acchennaidu Fired on YCP : రాష్ట్రంలోని ప్రతి వర్గం జగన్ బాధితులేనని ఆరోపించారు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Acchennaidu