ప్రకాశం జిల్లా పొదిలిలో తెదేపా నేత కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అడ్డ రోడ్డు నుంచి కాటూరివారిపాలెం వరకు చేపట్టిన ర్యాలీలో మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ఉద్ధృతం చేస్తామన్నారు. శాసనమండలిని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. ఆరోగ్యశ్రీ వంటి పథకాలను రద్దు చేయరనే గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. మార్కాపురం నియోజకవర్గంలోని తెదేపా, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.
'రాష్ట్ర రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలి' - tdp bike rally news in podhili
మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ పొదిలిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే ఉండాలని మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు. శాసనమండలిని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. ఆరోగ్యశ్రీ వంటి పథకాలను రద్దు చేయరనే గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు.

అమరావతికి మద్దతుగా పొదిలిలో భారీ బైక్ ర్యాలీ
అమరావతికి మద్దతుగా పొదిలిలో తెదేపా నేతల బైక్ ర్యాలీ
ఇదీ చూడండి: