పోలీసుల దాడిలోనే ప్రకాశం జిల్లాలో దళిత యువకుడు చనిపోయాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. సీఎం జగన్ రాజ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా అని లోకేశ్ ప్రశ్నించారు. అసలు ఈ రాష్ట్రంలో శాంతి, భద్రతలు ఉన్నాయా అని లోకేశ్ నిలదీశారు. దాడులకు పాల్పడిన పోలీసులు, వారి వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కులేదా?' - వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఆగ్రహం
వైకాపా ప్రభుత్వంలో దళితులకు జీవించే హక్కు లేదా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. ప్రకాశం జిల్లాలో దళిత యువకుడు పోలీసుల దాడిలో మృతి చెందాడని తెదేపా నేతలు ఆరోపించారు.
తెదేపా నేతలు
మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొడితే చనిపోయాడని తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. మన రాష్ట్రంలో చాలా మంది పెద్దలు మాస్క్ పెట్టుకోకుండా పరిపాలన చేస్తున్నారని.. వారిని ఏమి చేస్తారని నిలదీశారు.
ఇదీ చదవండి: ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలంటూ సీఎస్‌కు గవర్నర్ ఆదేశం