ప్రకాశం జిల్లా కనిగిరిలో స్థానిక తెదేపా మాజీ శాసన సభ్యులు డా.ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ...భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కనిగిరిలోని ప్రధాన వీధుల గుండా నినాదాలతో హోరెత్తుతూ సాగింది. ప్రజలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపడుతున్నా... ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టించుకోవటం లేదని డా.ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విమర్శించారు. విశాఖ ప్రజలు సైతం మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు.
అమరావతికి మద్దతుగా కనిగిరిలో తెదేపా బైక్ ర్యాలీ - Tdp Bike Rally in kanigiri
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ...ప్రకాశం జిల్లా కనిగిరిలో తెదేపా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో తెదేపా నేత డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు.
![అమరావతికి మద్దతుగా కనిగిరిలో తెదేపా బైక్ ర్యాలీ Tdp Bike Rally in kanigiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5746318-418-5746318-1579272927723.jpg)
కనిగిరిలో తెదేపా ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ
కనిగిరిలో తెదేపా ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ