స్వాతంత్ర సమరయోధుడు,ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు148వ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లాలో ఘనంగా జరిగాయి.ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి,ఆదిమూలపు సురేష్ పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం ప్రకాశం పంతులు జీవిత విశేషాలను తెలియజేసే ఫోటో గ్యాలరీని పరిశీలించారు.ప్రకాశం పేరులోనే జిల్లా ఉన్నా,అభివృద్దికి మాత్రం ఆమడ దూరంలో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.త్వరలో త్రిబుల్ ఐటీలో తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఒంగోలులో ఘనంగా ప్రకాశం పంతులు జయంతి వేడుకలు - ఒంగోలు
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి వేడుకలు ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.
tanguturi prakasham's 148 birthday celebrations at ongole in prakasham district