ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suspend: పదవీ విరమణ రోజే తహసీల్దార్ సస్పెన్షన్​! - పదవీ విరమణ రోజే తహసీల్దార్ సస్పెండ్ వార్తలు

ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో.. ఓ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్​ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. సుమారు 20 రోజుల క్రితం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్​ సహా, రెవెన్యూ ఇన్​స్పెక్టర్​, వీఆర్ఓలను విచారించారు. విచారణ నిమిత్తం.. వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే సస్పెండైన తహసీల్దార్ ఈ రోజే పదవీ విరమణ చేయాల్సి ఉండడం గమనార్హం.

tahasildar suspended on his retirement day at prakasam district
పదవీ విరమణ రోజే తహసీల్దార్ సస్పెండ్..!

By

Published : Jul 31, 2021, 10:41 PM IST

ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో.. తహసీల్దార్, రెవెన్యూ ఇన్​స్పెక్టర్​, వీఆర్ఓలను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సస్పెండ్ చేశారు. మండలంలోని హాజీపురం రెవిన్యూలో.. 5 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో సదరు సిబ్బందిపై.. సుమారు 20 రోజుల క్రితం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ సుధాకర్ రావు డిజిటల్ సిగ్నేచర్​ను జిల్లా కలెక్టర్ నిలుపుదల చేశారు. అనంతరం విచారణ అధికారులను నియమించారు.

విచారణ అనంతరం తహసీల్దార్ సుధాకర్ రావు, రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్, వీఆర్ఓ నరసింహులును.. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సస్పెండైన తహసీల్దార్ ఈ రోజే పదవీ విరమణ చేయాల్సి ఉండడం గమనార్హం. సస్పెండైన తహసీల్దార్ స్థానంలో.. కనిగిరి తహసీల్దార్ పుల్లారావుకు హనుమంతునిపాడు మండల ఇంఛార్జ్ తహసీల్దార్​గా బాధ్యతలు అప్పగించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details