ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"స్వాట్ టీమ్... ఏపీ పోలీసులకు గర్వకారణం"

రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రకాశం జిల్లా పోలీసులు రూపొందించిన స్వాట్‌ టీమ్‌ను డీజీపీ ప్రారంభించారు. ఇలాంటి బృందాన్ని ప్రతీ జిల్లాలోనూ, ప్రతీ కమిషనరేట్‌లోనూ ఏర్పాటు చేస్తామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. స్వాట్‌ టీమ్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

swat team

By

Published : Oct 3, 2019, 5:35 PM IST

స్వాట్ టీమ్ ప్రారంభం

ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆధ్వర్యంలో రూపొందించిన స్పెషల్‌ వెపన్‌ అండ్‌ టాక్టిక్స్ (స్వాట్) టీమ్​ను డీజీపీ ప్రారంభించారు. గతంలో స్వాట్‌ టీమ్లు పంజాబ్, చండీగఢ్, బెంగళూరు, దిల్లీ తదితర ప్రాంతాల్లో మాత్రమే ఉండేవి. తీవ్రవాదాన్ని, ఉగ్రవాద చర్యలను నిరోధించడానికి స్వాట్‌ టీమ్‌ల ఆవశ్యకత ఉందనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో తొలిసారిగా దీన్ని రూపొందించారు. యన్‌ఎస్​జీ, ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్ లాంటి టీమ్‌ల వంటి శక్తివంతవంతమైన బృందం జిల్లాకు ఒకటి ఉండాలనే ఉద్దశ్యంతో దీన్ని తయారు చేశామని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ పేర్కొన్నారు. అనంతరం స్వాట్ టీమ్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ వ్యక్తిని కిడ్నాపర్ల నుంచి రక్షించటం, హైజాక్‌ చేసిన బస్సును నివారించి ప్రయాణికులను కాపాడటం, బాంబులు నిర్వీర్యం చేయటం, తీవ్రవాదులను మట్టుబెట్టటం వంటి విన్యాసాలు నిర్వహించారు. ఈ టీమ్‌లో జాగిలాల ప్రదర్శన అందిరినీ అబ్బురపరిచింది. ఈ ప్రదర్శనలను తిలకించేందుకు పోలీసు అధికారులతో పాటు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభకనబరిచిన స్వాట్‌ టీమ్‌ బృంద సభ్యులకు అవార్డులు అందజేశారు.

రాష్ట్రమంతా ఏర్పాటు చేస్తాం

స్వాట్ టీమ్ రాష్ట్ర పోలీసులకు గర్వకారణమని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ఇలాంటి సామర్థ్యం కలిగిన పోలీస్‌ బృందాల సంఖ్య పెంచి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఇతర దేశాల సాంకేతక విజ్ఞానాన్ని, విధానాలను కూడా రాష్ట్ర పోలీస్‌ శాఖ అందిపుచ్చుకుంటుందని గౌతం సవాంగ్‌ వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details