ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశంలో అబ్బురపరిచిన స్వాట్ టీం క్షేత్ర ప్రదర్శన - స్వాట్ టీం ప్రదర్శన వార్తలు

ప్రకాశం జిల్లా పోలీసులు రూపకల్పన చేసిన స్వాట్ టీం క్షేత్ర ప్రదర్శన అబ్బురపరిచింది. రిజర్వు పోలీసుల్లో కొంతమంది సిబ్బందిని ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.

Swat team field performance dazzled in prakasam district
ప్రకాశంలో అబ్బురపరిచిన స్వాట్ టీం క్షేత్ర ప్రదర్శన

By

Published : Oct 2, 2020, 6:37 PM IST

Updated : Oct 3, 2020, 12:53 AM IST

ఉగ్రవాదులు దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రకాశం పోలీసులు రూపకల్పన చేసిన స్వాట్ (స్పెషల్ వెపన్ అండ్ టెక్నిక్) టీం క్షేత్ర ప్రదర్శన బృంద సామర్ధ్యానికి అద్దం పట్టింది. జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ ఆలోచనల నుంచి పుట్టిన స్వాట్ టీం విన్యాసాలు అబ్బురపరిచాయి.రిజర్వు పోలీసుల్లో కొంతమంది సిబ్బందిని ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.

ప్రకాశం పోలీస్ శాఖ సామర్ధ్యం పెంచడానికి కఠినమైన శిక్షణ ఏర్పాటు చేసి, ఆ శిక్షణలో భాగంగా తీవ్రవాద నిర్మూలన కోసం... కొత్త వ్యూహాలు, మెళకువలను పరిచయం చేశారు. కరోనా సమయంలో కూడా ఏ విధమైన అనారోగ్యానికి గురి కాకుండా వారి శిక్షణలో భాగంగా... ఆపరేషన్స్, సమస్యాత్మక ప్రాంతాలపై పర్యవేక్షణ, ఫైరింగ్ శిక్షణ కొనసాగించారు. మత పరమైన అంశాల్లో రాజకీయ ప్రమేయం వల్ల దాడులు నివరించాడనికి కూడా స్వాట్ టీం సహకారాన్ని అందిస్తోందని ఎస్పీ తెలిపారు.

స్వాట్ టీం క్షేత్ర ప్రదర్శన
Last Updated : Oct 3, 2020, 12:53 AM IST

ABOUT THE AUTHOR

...view details