ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న వినోద్‌కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అర్ధరాత్రి వరకు గ్రామంలోని పలువురితో కలిసి ఉన్న అతను తెల్లవారేసరికి ఇంటి ముందు గాయాలతో పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. పరిశీలించిన వైద్య సిబ్బంది మృతి చెందినట్లు తెలిపారు. కాగా మృతుని ఒంటిపై గాయాలుండటంతో ఎవరైనా కొట్టి చంపారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్, పర్చూరు ఎస్ఐ రమణయ్య సంఘటనాస్తలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
వీరన్నపాలెంలో గ్రామ వాలంటీర్ అనుమానాస్పద మృతి - today prakasam district latest news update
ప్రకాశం జిల్లాలోని వీరన్నపాలెం గ్రామ వాలంటీర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. గాయాలతో ఇంటి ముందు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్య బృందం నిర్ధారించింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామ వాలంటీర్ అనుమానాస్పద మృతి