ప్రకాశం జిల్లాలోని పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండతున్నాయి. రహదారులు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. పెరిగిన ఎండలకు తోడు.. వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప.. బయటకు రావొద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు. ఎండల వేడి భరించలేక వాహనదారులు రహదారి పక్కనే ఉన్న చెట్టుకింద సేదతీరుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రోహిణీ కార్తెలో ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు.
భానుడి భగభగ.. ప్రజలు విలవిల
ప్రకాశం జిల్లాలో భానుడి ప్రతాపానికి జనం అల్లాడుతున్నారు. ఇంటి నుంచి రావటానికి జంకుతున్నారు.
భానుడి భగభగలు