'ప్రజల దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రాలు ఏర్పాటు' - చిన్నగంజాం
రాష్ట్రవ్యాప్తంగా భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రకాశం జిల్లాలోని వేటపాలెం, చీరాల ప్రాంతాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి..మజ్జిగ పంపిణీ చేస్తున్నాయి.
'ప్రజల దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రాలు ఏర్పాటు'
భానుడి ప్రతాపానికి ప్రకాశం జిల్లాలోని చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, పర్చూరు ప్రాంతాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. వేటపాలెం, చీరాలలో వాసవి క్లబ్, సత్యసాయి సేవాసమితి, పలు స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో.. మజ్జిగ, సబ్జా నీళ్ల చలివేంద్రాలు ఏర్పాటుచేసి..ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు.
ఇవి చదవండి...అధైర్యపడొద్దు... అండగా ఉంటా: చంద్రబాబు