ప్రకాశం జిల్లా కంభంలోని స్థానిక అర్బన్ కాలనీలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సరైన పత్రాలులేని 46 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక ట్రాక్టర్, 12 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకూ ఈ మొత్తం 70 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రజలు, వాహనదారులు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని.. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
కంభంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు - ప్రకాశం జిల్లా కంభంలో పోలీసుల తనిఖీలు
ప్రకాశం జిల్లా కంభంలోని స్థానిక అర్బన్ కాలనీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
![కంభంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు sudden rides at prakasam dst kambam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5223506-607-5223506-1575096524710.jpg)
తనిఖీలు చేస్తున్న పోలీసులు