కొరిసపాడు మండలం కృష్ణంరాజువారి పాలెంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవ వేడుకలలో కావడుల ఊరేగింపు చేశారు. ఆలయంలోని గాయత్రి అమ్మవారికి మహాయజ్ఞం నిర్వహించారు. లోక కల్యాణార్థం, మహసర్పదోష నివారణ, ముఖ్యంగా ప్రజలు కరోనా బారి నుంచి క్షేమంగా బయటపడాలని గాయత్రీ దేవికి ప్రత్యేక పూజలు చేసినట్టు దేవస్థానం అర్చకులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న 116 శివలింగాలతో ఉన్న మహా శివ లింగ స్వరూపం వద్ద భక్తులు హోమాలు చేశారు.
కృష్ణంరాజువారిపాలెంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవ వేడుకలు
ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం కృష్ణంరాజువారిపాలెంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కావడుల ఊరేగింపు చేపట్టారు. ఆలయంలోని గాయత్రి అమ్మవారికి మహాయజ్ఞం వైభవోపేతంగా నిర్వహించారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవ వేడుకలు
అమ్మవారి యజ్ఞంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారని అర్చకులు తెలిపారు. అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారన్నారు. అన్నదానం కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.