Subabul Farmers: సుబాబుల్ రైతులకు కొన్నేళ్లుగా నష్టాలు తప్పడం లేదు. ధర లేదంటూ ఏళ్లుగా కోతలు చేపట్టకపోవడంతో సుబాబుల్ తోటలు వనాలను తలపిస్తున్నాయి. ఆరేడేళ్లుగా సుబాబుల్‌కు మార్కెట్ లేక.. పొలాల్లోనే వదిలేశామంటూ రైతులు చెబుతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి.. అమ్ముకోలేని పరిస్థితిలో ఏటా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.
Subabul Farmers: ప్రకాశం జిల్లా అద్దంకి, జె.పంగులూరు, కొరిసపాడు, మార్టూరు తదితర మండలాల్లో దాదాపు 70వేల ఎకరాల్లో సుబాబుల్ సాగు చేస్తున్నారు. మూడేళ్లుగా సుబాబుల్‌కు సరైన ధర లేకపోవడం, కనీసం నష్టానికైనా అమ్ముకుందామన్నా కొనేవారు లేకపోవడం వల్ల.. సుబాబుల్ కోతలకు నోచుకోవడం లేదు. ఎటుచూసినా ఏపుగా పెరిగి సుబాబులు తోటలు అడవులను తలపిస్తున్నాయి. మొదట్లో మంచి ధర రావడంతో రైతులు సుబాబుల్ సాగు వైపు మొగ్గుచూపారు. ప్రస్తుతం కనీస ధర కూడా లభించకపోవడంతో.. ఇప్పటికే 3 కోతలు చేయాల్సిన తోటలను అలాగే వదిలేశామని రైతులు వాపోతున్నారు.