ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆవులంటే ఆయనకు ప్రాణం.. ఏ పోలీస్ స్టేషన్​ వెళ్లినా.. వెంటే తీసుకెళ్తారు! - పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆవులు పెంచుతున్న ఎస్సై వార్తలు

ఉద్యోగరీత్యా నిత్యం ఒత్తిడిని ఎదురుకునే పోలీసు కొలువు ఆయనది. కరోనా వేళ ఆ ఒత్తిడి రెట్టింపై ఉంటుంది. ఎంత తీరికలేని పనిచేస్తున్నా.. దేశీయ ఆవులపై ఆయనకున్న మమకారం.. అరుదైన జాతుల సంరక్షణకు పాటుపడేలా చేసింది. లక్షల రూపాయల పెట్టి గోవులను కొని, వాటిని పెంచుతూ.. సంతతి అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఆ ఎస్సై.

ఆవులంటే ఆయనకు ప్రాణం.. ఏ పోలీస్ స్టేషన్​ వెళ్లినా.. వెంటే తీసుకెళ్తారు!
ఆవులంటే ఆయనకు ప్రాణం.. ఏ పోలీస్ స్టేషన్​ వెళ్లినా.. వెంటే తీసుకెళ్తారు!

By

Published : May 13, 2021, 6:05 PM IST

ఆవులంటే ఆయనకు ప్రాణం.. ఏ పోలీస్ స్టేషన్​ వెళ్లినా.. వెంటే తీసుకెళ్తారు!

ప్రకాశం జిల్లా యద్దనపూడి ఎస్సై జీవీ చౌదరికి.. దేశీయ ఆవులంటే ప్రాణం. రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు.. గో పెంపకంపై ఎప్పట్నుంచో ఆసక్తి ఉన్నా... ఉద్యోగ రీత్యా వివిధ చోట్లకు తిరుగుతండటంతో వీలు పడలేదు. భార్య ప్రోత్సాహం, పిల్లలకు ఆవు పాలు ఇవ్వాలనే ఆలోచనతో తొలుత ఓ మేలు జాతి గోవును కొన్నారు. ఆవుల పెంపకం, వాటి ఆవశ్యకత, అంతరిస్తున్న గో జాతులపై అధ్యయనం చేశాక.. తాను వీలైనన్ని ఆవులను పెంచాలని భావించారు.

మార్టూరులో ఓ పాక నిర్మించి రెడ్ సింధి, పుంగనూరు, కపిల, గిర్, ఒంగోలు జాతి ఆవులను కొనుగోలు చేసి పెంచుతున్నారు. నెలకు 30 నుంచి 40 వేల దాకా ఆవుల సంరక్షణకు ఖర్చవుతుందని.. తాను ఎక్కడికి బదిలీ అయినా.. ఆవులనూ తీసుకెళ్తుంటానని జీవీ చౌదరి తెలిపారు. పని ఒత్తిడినీ లెక్క చేయకుండా గో జాతి సంరక్షణకు కృషి చేస్తున్న ఎస్సైని అందరూ అభినందిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details