ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరంలోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాల గేటు వద్ద టీఎన్ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ విద్యార్థిని తేజశ్రీ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాలేజీ ఛైర్మన్ నిడమనూరు నాగేశ్వరరావు వాహనాన్ని ముట్టడించారు.
తేజశ్రీకి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తరఫున కమిటీ వేశారని.. కమిటీ నివేదిక వస్తే నిజానిజాలు తెలుస్తాయని ఛైర్మన్ అన్నారు. బాధితురాలికి నా వంతుగా న్యాయం చేస్తానని హామీ ఆయన ఇచ్చారు.