ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వయసు పద్నాలుగేళ్లు... ఎక్కారు హిమాలయాలు... - ప్రకాశం జిల్లా

చదువంటే పుస్తకాల్లో ఉన్న అక్షరాలను మెదళ్లులోకి ఎక్కించడమే కాదు. ఆత్మవిశ్వాసం పెంచే పాఠాలు నేర్చుకోవడం. దీన్నే అచ్చంగా ఆచరిస్తున్నారా విద్యార్థులు. ఆత్మవిశ్వాసంతో అతి చిన్న వయసులోనే పర్వతాలు అదిరోహిస్తున్నారు. ఔరా అనిపిస్తున్నారు.

వయసు పద్నాలుగేళ్లు... ఎక్కారు హిమాలయాలు...

By

Published : Sep 3, 2019, 9:42 AM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులోని నెక్ట్స్‌ జెన్‌ పాఠశాల విద్యార్థులు పర్వతారోహణ చేసి అబ్బురపరుస్తున్నారు. చిరు ప్రాయం నుంచి ఆ దిశగా శిక్షణ తీసుకున్నారు. రాక్‌ క్లైంబింగ్లో, ట్రక్కింగ్ల తర్ఫీదు పొంది హిమాలయాలు అధిరోహించారు. సాహదార్‌ పీక్‌, మనాలీ వద్ద ఉన్న 5300మీటర్ల ఎత్తున్న ఫ్రెండ్‌షిప్‌ పీక్‌ను 14మంది సునాయాసంగా ఎక్కేశారు.

హిమాలయాలకు వెళ్లే ముందు ఉత్తరాఖండ్​లో వారంపాటు మంచుకొండల్లో వాతావరణంపై అవగాహన, నడిచే విధానం తెలుసుకున్నారు. ఈ యాత్ర తమకు ఓ మంచి అనుభూతి మిగిల్చిందని, ఆత్మవిశ్వాసం ఏర్పడిందని విద్యార్థులు అంటున్నారు.

పిల్లలను సాహస యాత్రలకు అలవాటు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి కష్టనష్టాలైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటున్నారు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు.

వయసు పద్నాలుగేళ్లు... ఎక్కారు హిమాలయాలు...

ఇదీ చూడండి

విక్రమ్ ల్యాండర్​పైనే ఇస్రో శాస్త్రవేత్తల దృష్టి'

ABOUT THE AUTHOR

...view details