ప్రకాశం జిల్లా దర్శిమండలం రాజంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన విద్యార్థి దుర్మారణం చెందాడు. మాబుజాన్ బాషా ఇంటర్ పరీక్షలు రాశాడు. లాక్డౌన్తో ఇళ్ల దగ్గరే ఉంటున్న విద్యార్థులు సరదాగా ఈతకని వెళ్లారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేపనుల కోసం మట్టి తవ్విన కుంటలో స్నేహితులతో కలసి ఈతకు వెళ్లాడు. మాబుజాన్ బాషా ఒడ్డు మీద నుంచి ఒక్కసారిగా నీటిలోకి దూకాడు. స్నేహితుడు ఎంత సేపటికి పైకి రాకపోయే సరికి భయపడన తోటి స్నేహితుడు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కుటుంబ సభ్యులు నీటి కుంటలో గాలించి బాషాను బయటకు తీశారు. అయితే అప్పటికే జాన్ భాషా మృతి చెందడం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ప్రాణం తీసిన ఈత సరదా..! - student dead at prakasham news
ఇంటర్ పరీక్షలు రాసి లాక్డౌన్ కారణంగా ఇంటి దగ్గర ఉన్న స్నేహితులు సరదాగా ఈత కోసమని వెళ్లారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనుల కోసం మట్టి తవ్విన కుంటలో ఈతకు వెళ్లిన బాషా బురదలో కూరుకుపోయి మృతి చెందాడు.
ఈతకు వెళ్లి యువకుడు మృతి
ఇవీ చూడండి...