కరోనా వైరస్ నివారణకు వినూత్న ప్రచారం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను నిలువరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆవగాహన కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఇంకొల్లులో బాలుడు వినూత్న రీతిలో జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపాడు. కర్ఫ్యూకు నేను సిద్ధమంటూ తలకట్టుపై అక్షరాలను లిఖించుకున్నాడు. ఆదర్స పాఠశాలలో చదువుతున్న అమరా రామాంజనేయులు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేస్తున్నాడు.
వినూత్న క్రాఫ్‌తో కర్ఫ్యూకు మద్దతు