ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చదువుకోమని తండ్రి మందలింపు... తనువు చాలించిన తనయ ! - ప్రకాశం జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య

ఆలోచనారాహిత్యంతో చిన్న చిన్న కారణలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే ప్రకాశం జిల్లా కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. టీవీ చూస్తున్న కూతుర్ని చదువుకోమని తండ్రి మందలించటంతో మనస్థాపం చెంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

చదువుకోమని తండ్రి మందలింపు...తనువు చాలించిన తనయ !
చదువుకోమని తండ్రి మందలింపు...తనువు చాలించిన తనయ !

By

Published : Jun 14, 2020, 3:00 PM IST

ప్రకాశం జిల్లా పామూరు మండంలోని కొత్తపల్లి గ్రామంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన చిమలదిన్ని దేవి ప్రసన్న బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతోంది. టీవీ చూస్తున్న ప్రసన్నను చదువుకోమని తండ్రి మందలించాడు. మనస్థాపం చెందిన ప్రసన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details