ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున.. పోలీసులు ఆంక్షలను కఠినతరం చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యవసరాల కొనుగోలుకు అనుమతిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఔషధ దుకాణాలు తెరిచి ఉంటాయని అధికారులు చెప్పారు.
కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన ఆంక్షలు - corona cases in chirala
ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. పట్టణంలో రోజూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా అప్రమత్తమైన అధికారులు ఆంక్షలను కఠినతరం చేశారు.
![కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన ఆంక్షలు strict-rules-against-spreading-corona-virus-in-chirala-corona-virus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7945935-252-7945935-1594218294726.jpg)
చీరాల పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు
పట్టణంలోకి వచ్చే వాహనాలను.. ఆంక్షల కారణంగా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఒకటో పట్టణ ఎస్ఐ సురేశ్ ఆధ్వర్యంలో రహదారుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అనవసరంగా రోడ్ల పైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇదీచదవండి.
మద్యం మత్తులో గొడవ... ఒకరు మృతి
Last Updated : Jul 8, 2020, 9:30 PM IST