ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మత్స్యకారులకే తెలియని వింత చేప... వాడరేవు తీరానికి కొట్టుకు వచ్చింది!

ప్రకాశం జిల్లా వాడరేవు సముద్రతీరానికి ఓ వింత చేప కొట్టుకు వచ్చింది. దానికి మూడు కళ్లు ఉన్నాయనీ.. నీళ్లల్లో వేస్తే రబ్బర్​లా సాగుతోందని మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

strange fish
వాడరేవు తీరానికి కొట్టుకు వచ్చిన వింత చేప

By

Published : Feb 19, 2021, 7:13 AM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరానికి వింత చేప కొట్టుకొచ్చింది. వాడరేవు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్తుండగా.. సముద్ర అలల్లో తీరానికి కొట్టుకొచ్చిన వింతచేప కంటపడింది.. మత్స్యకారులు పరిశీలించగా ఆ వింత చేపకు మూడు కళ్ళు ఉన్నాయని.. ఆకారం విచిత్రంగా ఉందని, నీళ్ళల్లో వేస్తే రబ్బరులాగా సాగుతోందని వివరించారు.

వాడరేవు తీరానికి కొట్టుకు వచ్చిన వింత చేప

సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు వివిధ రకాల చేపలు చూస్తుంటామని.. ఈరకం వింత చేపను చూడటం ఇదే మొదటిసారని వాడరేవు మత్స్యకారులు తెలిపారు. ఈ చేప క్వారల్స్ రకానికి చెందిన వింత జీవి అని మత్స్యశాఖ విశ్రాంత జేడి బలరామ్​చెబుతున్నారు.

ఇదీ చదవండి:పథకాల లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్ పోల భాస్కర్

ABOUT THE AUTHOR

...view details