లాక్ డౌన్ తో స్తంభించిన జనజీవనం
లాక్ డౌన్ తో స్తంభించిన జనజీవనం - ప్రకాశం జిల్లాలో లాక్ డౌన్
కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లో భాగంగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అధికారుల హెచ్చరికలతో రహదారులన్ని బోసిపోయాయి.
![లాక్ డౌన్ తో స్తంభించిన జనజీవనం stranded-life-with-lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6515792-81-6515792-1584961055446.jpg)
లాక్ డౌన్ తో స్తంభించిన జనజీవనం
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు చెప్పిన నేపథ్యంలో రహదారులు బోసిపోయాయి. మార్టురు, ఇంకొల్లు ప్రాంతాల్లో నిత్యావసర దుకాణాలు మినహా మిగిలిన దుకాణాలన్నీ మూత పడ్డాయి. బ్యాంకులు పనిచేస్తున్నా వినియోగదారులు రాకపోవటంతో లావాదేవీలు మందకొడిగా సాగుతున్నాయి.