ప్రకాశం జిల్లాలో లాక్డౌన్లో మినహాయింపులు ఇవ్వటంతో దుకాణాలు తెరుచుకున్నాయి. జిల్లా కేంద్రం ఒంగోలులులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా ఉండటం వల్ల ఇన్ని రోజులు నిబంధనలు కఠినంగా అమలు చేశారు. ఉదయం 6గంటల నుంచి 9 వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు, కూరగాయలు మార్కెట్ నిర్వహణకు అనుమతులుండేవి. కేసులు తగ్గడంతో, లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 7 గంటలవరకు దాదాపు అన్ని రకాల దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు. రెండు నెలలు తరువాత సినిమా హాళ్లు, మాల్స్ , హోటల్స్ మినహా దుకాణాలు అన్ని తెరుచుకున్నాయి. కంటైన్మెంట్ జోన్స్ పరిధిని గోపాల్‌నగర్, ఏకలవ్య నగర్ ప్రాంతాల్లో ఆంక్షలు విధించినందున ఆ ప్రాంతాల్లో మాత్రం దుకాణాలు తెరుచుకోలేదు. ఏకలవ్య కాలనికి సమీపంలో ఆర్టీసీ బస్టాండ్, చేపలు మార్కెట్ ఉండటం వల్ల ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఆర్టీసీ బస్సులు యధావిధిగా పట్టణ శివారు ప్రాంతాల నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి.
లాక్ డౌన్ సడలింపు.. దుకాణాల పునఃప్రారంభం - latest ongole news
ఒంగోలులో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ సడలించి అనుమతులు ఇచ్చారు. దీంతో రెండు నెలలు తరువాత దుకాణాలు తెరుచుకున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దాదాపు అన్ని రకాల దుకాణాలు తెరిచేందుకు అధికారులు అనుమతించారు.
లాక్ డౌన్ సడలింపు.. దుకాణాలు పునఃప్రారంభం