గేదెలు కట్టేసే విషయంలో జరిగిన వివాదం అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారితీసింది. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగరాజుకుంటలో ఈ ఘటన జరిగింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కొండయ్య అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొండయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. మిగతా వారికి పొదిలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. ఒకరి పరిస్థితి విషమం - ప్రకాశం జిల్లాలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ
గేదెలు కట్టేసే విషయంలో జరిగిన వివాదం అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో కొండయ్య అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. ఒకరి పరిస్థితి విషమం