మహనీయుల విగ్రహాలకు ముసుగులు - statue
ఎన్నికల కోడు అమల్లోకి వచ్చాక రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులపడ్డాయి. ప్రకాశం జిల్లా చీరాలలో మున్సిపల్ సిబ్బంది రాజకీయ నాయకుల విగ్రహాలతో పాటు మహనీయుల ప్రతిమలకూ ముసుగులు వేశారు.
మహనీయులకూ ముసుగులు
ఎన్నికల కోడ్ అమలులో మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహం చూపారు. ప్రకాశం జిల్లా చీరాలలో రాజకీయనాయకుల విగ్రహాలతో పాటు మహనీయుల ప్రతిమలకు ముసుగులువేశారు. పట్టణంలోని ఆంధ్రరత్న రోడ్డులో ఉన్న ఘంటశాల, మదర్ థెరిస్సా విగ్రహాలకూ ముసుగులువేశారు. ఈ విషయంపై ఈటీవీ భారత్ కథనం ప్రసారం చేసింది. ఈ కథనానికి స్పందించిన అధికారులు విగ్రహాల ముగుసులు తొలగించారు.